కరోనా వైరస్ లక్షణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

రోజురోజుకి విస్తరిస్తున్న కరోనా వైరస్‌ని కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా ఈ వైరస్ లక్షణాలు తెలుసుకుంటే దాని నుంచి దూరంగా ఉండొచ్చు.. కరొనా వైరస్‌లు శరీరంలో ప్రవేశించిన అనంతరం అనేక తీవ్ర లక్షణాలను చూపుతుంది. ఇది కొన్ని సార్లు మిగతా సమస్యలకు కూడా కారణం అవుతుంది. న్యూమోనియా వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. దీంతో పాటు.. కఫంతో కూడిన దగ్గు ఉంటుంది.. ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంటుంది. ఛాతీ దగ్గర నొప్పిగా ఉంటుంది. గుండె, ఊపిరితిత్తుల దగ్గర ఇబ్బందిగా ఉంటుంది. రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది.